హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజీవ్ స్వగృహ ఇళ్లపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్

PLD: నరసరావుపేట లింగంగుంట్లలోని రాజీవ్ స్వగృహ భవనాలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న భవనాల వేలానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగంలో లేని భూమిని గుర్తించి ప్రభుత్వానికి తిరిగి అప్పగించే చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌ అంశాలను నిర్ణీత గడువులో పరిష్కరించి నివేదిక ఇవ్వాలన్నారు.