HYD: నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం కీలక ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి పొన్నం తెలిపారు. గాజులరామారం, ఘట్‌కేసర్‌లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దూరప్రాంత, అంతర్రాష్ట్ర బస్సులను శివారు టెర్మినల్స్‌కే పరిమితం చేసి, అక్కడి నుంచి మెట్రో, బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా కార్యాచరణ చేపడతామన్నారు.
తెలంగాణ
శివారు టెర్మినల్స్‌కు దూరప్రాంత బస్సులు: మంత్రి


