హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాయితీతో పశు బీమా సౌకర్యం'

SKLM: గొర్రెలు, మేకల పెంపకదారులకు ప్రభుత్వం 85 శాతం రాయితీతో పశుబీమా సౌకర్యం కల్పిస్తోందని పశువైద్యాధికారి డా. కిరణ్‌కుమార్ లఖినేని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో జీవానికి రూ. 6,000 బీమా, లబ్ధిదారుడి వాటా రూ. 27గా నిర్ణయించారు. కోటబొమ్మాళి మండలంలో 730 జీవాలకు అవకాశం ఉందన్నారు. 6 నెలలు పైబడిన గొర్రెలు, మేకలకు ఏడాది కాలానికి బీమా చేసుకోవచ్చని తెలిపారు.