హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిరుధాన్యాల వంటకాలతో పోషణపై అవగాహన

KRNL: ఆదోనిలో విజయ భాస్కర్ రెడ్డి అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో డిల్లేశ్వరి ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన పోషకాహార వంటకాల ప్రదర్శన నిర్వహించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి ఇంటివద్ద తయారు చేసిన పోషకాహారం, చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు పిల్లలకు అందించాలన్నారు.