హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే తనిఖీ

NDL: నంది కొట్కూరు మండల తహసీల్దార్ కార్యాలయంను ఎమ్మెల్యే జయసూర్య మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ సెక్షన్ విభాగాల రికార్డ్‌లు పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ సేవలు, పెండింగ్ పైల్స్ క్లియర్ చేయాలని, సమస్యలు పరిష్కరించి, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని సూచించారు.