హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

36 వార్డులుగా పలమనేరు మున్సిపాలిటీ

CTR: పలమనేరు మున్సిపాలిటీని 36 వార్డులుగా విభజిస్తూ ప్రభుత్వం తుది ప్రకటన జారీ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ లోకేష్‌ వర్మ మంగళవారం తెలిపారు. వార్డుల విభజనకు సంబంధించిన వివరాలను ఆర్డీవో, పలమనేరు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. పలమనేరు పరిధిలోని ఓటర్లు, ప్రజలు వివరాలను పరిశీలించుకోవాలని కోరారు.