హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

KRNL: తుగ్గలి (మం) జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్లపల్లిలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఎరుకల విక్రమ్ (18) ట్రాక్టర్ నుంచి రాళ్లు దించుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ తగిలి షాక్‌కు గురయ్యాడు. చికిత్స పొందుతూ.. మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి మురార్జీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.