హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి

PLD: నరసరావుపేటలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా లైసెన్స్‌డ్ ఇంజినీర్లు, సర్వేయర్ల వెల్ఫేర్ అసోసియేషన్ 59వ వార్షికోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం మంజూరులో సహకరిస్తామని తెలిపారు.