JN: రఘునాథ్‌పల్లి మండలం నిడిగొండ వద్ద 163వ జాతీయ రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు, భారీ వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి వర్షాలకు మరింత దెబ్బతింది. రోడ్డు కింద మట్టి కోతకు గురై కుంగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
కోతకు గురైన జాతీయ రహదారి


