హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైస్కూల్లో శక్తి టీం అవగాహన కార్యక్రమం

బాపట్ల ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల జాండ్రపేట BV & BN పాఠశాలలో ఎస్సై రాజ్యలక్ష్మి, శక్తి టీమ్ కానిస్టేబుల్ కే.సుబ్బారావు నేతృత్వంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులకు శక్తి యాప్, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, స్వయంరక్షణ మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 100, 112, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు.