KRNL: కలెక్టరేట్‌లోని సమాచార శాఖ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ గణనాథునికి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. గణనాథుడికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డీడీ జయమ్మ, పాత్రికేయ గణనాథుని బృందం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాత్రికేయ గణనాథునికి జేసీ ప్రత్యేక పూజలు


