హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ

కృష్ణా: పెనమలూరు మండలం కానూరులో రూ. 80 లక్షల సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలసి ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం శంకుస్థాపన చేశారు. మురిగురనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.