హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో చోరీ.. వెండి ఆభరణాలు మాయం

ATP: కల్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి మంగళసూత్రంతో పాటు వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. వాటి విలువ దాదాపు రూ.2 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఇద్దరు వ్యక్తులు ఆలయం వద్ద రెక్కీ నిర్వహించినట్లు అక్కడి ఆలయంలోని నిఘా నేత్రాల్లో స్పష్టంగా కనిపించింది.