హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ హెల్పర్‌ పోస్టులకు అవకాశం

CTR: కుప్పం మండలంలో ఖాళీగా ఉన్న 22 అంగన్వాడీ హెల్పర్‌ పోస్టులకు అర్హులైన వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ చంద్రకళ మంగళవారం సూచించారు. సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధిలో నివసిస్తూ పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని తెలిపారు. ఈనెల 16 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.