హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనానికి వాటిపై నిషేధం..!

అన్నమయ్య: రాయచోటి వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు. శబ్ద కాలుష్య నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ఉత్సవ కమిటీలు, డీజే నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి ముందుగానే నిబంధనలు వివరించామని, డీజేలకు ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.