హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రొంపిచర్లను కరువు మండలంగా ప్రకటించాలి'

PLD: రొంపిచర్లను కరువు మండలంగా ప్రకటించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం కట్ట సెంటర్‌ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. పంట రుణాల మాఫీ, పశుగ్రాసం, సబ్సిడీ విత్తనాలు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నాయకులు కోరారు.