W.G: RTC విశ్రాంత కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని రిటైర్డ్ కార్మికుడు జిలానీ కోరారు. మంగళవారం ఆయన తాడేపల్లిగూడెం నుంచి ఒక ప్రకటన ఇచ్చారు. వీరికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని, తమ సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విశ్రాంత కార్మికులకు పింఛను ఇవ్వాలి'


