హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన వైద్యం అందించాలి'

పాక్‌ మాజీ ప్రధాని, క్రికెట్‌ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు గ్రెగ్ చాపెల్, స్టీవ్‌ వాలు  ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో అతడికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు ఏడుగురు మాజీ కెప్టెన్లు లేఖ రాశారు. రాజకీయాలను పక్కనపెట్టి మానవతా దృక్పథంతో జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.