హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాల వద్ద అన్నదానం

CTR: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని కొత్త ఇండ్లలో వినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మండపం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదం పంపిణీ చేశారు. అలాగే లక్ష్మీపురం కాలనీ, రాంపల్లి, కొత్తపేట, సూర్యనగర్ తదితర ప్రాంతాల్లోనూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.