హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రద్దీపై ఎప్పటికప్పుడు సమీక్ష: టీటీడీ

CTR: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు టీటీడీ సీవీఎస్‌వో మురళీకృష్ణ తెలిపారు. భక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు 3 వేలకుపైగా సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించినట్లు చెప్పారు. రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మైకుల ద్వారా భక్తులకు సూచనలు ఇస్తామని తెలిపారు.