హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మొదలైన వినాయక నిమజ్జనాలు

ప్రకాశం: కంభం చెరువుకట్టపై మంగళవారం గణేష్ విగ్రహాల నిమజ్జనాలు ఒక్కొక్కటిగా ప్రారంభమయ్యాయి. కంభం (మం) పరిసర ప్రాంతాల నుంచి గణనాథులను భక్తులు ఊరేగింపుగా చెరువు గట్టుకు తీసుకొచ్చారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో కంభం ప్రాంతం మారుమోగింది. నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.