హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సేవా తత్పరులకే మొదటి ప్రాధాన్యం'

VSP: స్థానిక పోరు వేళ 92వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థిత్వం విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ ఆవిర్భావం నుండి, అంతకుముందు ప్రజారాజ్యం రోజుల నుండి జనసేన సిద్ధాంతాలను భుజాన మోస్తూ క్షేత్రస్థాయిలో చెమటోడ్చిన సీనియర్ నాయకుడు గొన్నబత్తుల అప్పలరాజు తన పొలిటికల్ రెజ్యూమ్‌ను ప్రముఖ జనసేన నాయకురాలు అంగ దుర్గా ప్రశాంతికి అందజేశారు.