హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్

TPT: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌ రోడ్డులో మంగళవారం ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన భక్తులు కారులో తిరుపతికి బయల్దేరారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ముందు భాగం దెబ్బతింది. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను తిరుపతికి తరలించారు.