హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాభావంతో ప్రభుత్వంపై సీపీఐ ఆగ్రహం

KRNL: ఎమ్మిగనూరులో వర్షాభావ పరిస్థితులపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. రైతులు పంటలు కోల్పోయి, కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాయకులు విమర్శించారు. రేషన్‌ షాపుల ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, రైతులు, కూలీలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.