హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్వీడీ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన గదులు

E.G: నిడదవోలు ఎస్వీడీ మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. PM-USHA పథకంలో సుమారు రూ.3.36 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.