హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాధాకృష్ణుల అలంకరణలో సిద్ధి వినాయకుడు

VZM: బొబ్బిలి మున్సిపాలిటీ మల్లమ్మపేట శ్రీరామ్‌నగర్‌లో సిద్ధి వినాయక సప్తరాత్రుల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బాల గణపతి యూత్ ఆధ్వర్యంలో రాధాకృష్ణుల అలంకరణలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మండపం భక్తులను ఆకట్టుకుంటోంది. చిన్న చిన్న బాల గణపతి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.