హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి

PPM: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన ఎజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించిన ఎమ్మెల్యే ఇతర సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.