కోనసీమ: కె.గంగవరం మండలానికి చెందిన క్యాన్సర్ బాధితుడు పెద్దింశెట్టి వెంకటేష్ కుటుంబానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి చెక్కు అందజేశారు. ధైర్యంగా చికిత్స తీసుకోవాలని, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
క్యాన్సర్ బాధితుడికి అండగా మంత్రి


