హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగులో యువకుడు గల్లంతు

ASR: చింతూరు మండలం సోకిలేరు వ్యూపాయింట్‌కు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మంగళవారం వచ్చారు. స్థానిక వాగులో ఆరుగురు స్నానానికి దిగగా ప్రవాహంలో నీలేష్‌ అనే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన నీలేష్‌ కోసం పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.