హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎరువుల బస్తాలో మట్టి

AKP: కొరుప్రోలు రైతు రామచంద్రరాజు మన గ్రోమోర్‌లో ఎరువుల బస్తా కొనుగోలు చేయగా, అందులో 10 నుంచి 15 కిలోల ఎర్రమట్టి గడ్డలు బయటపడ్డాయి. ఇది చూసి అవాక్కయిన రైతు వెంటనే డీలర్ మరియు వ్యవసాయాధికారి సౌజన్యకు ఫిర్యాదు చేశారు. నాణ్యత లేని ఎరువులు అమ్ముతూ రైతులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.