హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కొత్త భవన పనులు పరిశీలన

TPT: నగరంలోని అవిలాల వద్ద నిర్మిస్తున్న జిల్లా టీడీపీ పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణ పనులను తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు, ఆధునిక సౌకర్యాల కల్పనపై సంబంధిత అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.