హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ATP: భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధిలో ఇంజినీరింగ్ రంగం సేవలను, సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఇంజినీర్ల సేవలను కొనియాడారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ, రాష్ట్ర ఇంజినీర్లందరికీ ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.