హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ పోషణ మాసంపై అవగాహన ర్యాలీ

ప్రకాశం: 'మన అంగన్వాడీ–మన బాధ్యత' ప్రధాన ఇతివృత్తంతో కంచర్లవారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసం–2026 కార్యక్రమాన్ని ICDS సూపర్వైజర్ పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల పోషణ, ఆరోగ్యం, సంరక్షణలో అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యతను వివరించారు. తృణధాన్యాలు, పప్పులు, పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.