NTR: నందిగామ కోనేరు పుష్కరిణి పరిరక్షణ కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్ష నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. అక్రమ దారుల చెర నుండి కోనేరును విడిపించాలని డిమాండ్ చేస్తూ.. ఈ పోరాటం కొనసాగిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, కోనేరును ఆక్రమణల నుంచి రక్షించాలని దీక్షలో పాల్గొన్నవారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామ కోనేరు పరిరక్షణకు నిరాహార దీక్ష


