హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మారు వేషంలో ఎమ్మెల్యే..!

ELR: బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడి రూపంలో ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులని స్వయంగా పరిశీలించేందుకు స్వయంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలు, సిబ్బంది పనితీరును నిశితంగా పరిశీలించారు. అనంతరం ప్రజలకి జాప్యం లేకుండా అధికారులు వ్యవహరించాలన్నారు.