హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరిలో ప్రజాధనం వృథా..!

NLR: ఉదయగిరి ఆనకట్ట ఆధునీకీకరణ పనులకు ప్రభుత్వం వెచ్చించిన లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయని పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మించిన రాతికట్టడాలు బీటలు వారడంతోపాటు కట్టకు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు.