హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడలో ఈ నెల 20న ‘కన్యాశుల్కం’

E.G: గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 20న కాకినాడ దండు కళాక్షేత్రంలో ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావును మంగళవారం దండు భాస్కరరావు, రవి ఆహ్వానించారు. నాటక ప్రదర్శనకు తనవంతు సహాయంగా కంబాల శ్రీనివాసరావు రూ.లక్ష చెక్కును దండు భాస్కరరావుకు అందజేశారు.