హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి'

MNCL: తాండూరు మండల ఉప తహశీల్దార్‌కు మంగళవారం బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం స్వతంత్ర పోరాట చరిత్రను మరుగున పడేస్తున్నాయని మండిపడ్డారు.