VZM: తెర్లాం మండలం పాములవలసలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం 'పల్లె బాటలో ఈగల్' కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామ ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో WSI ఎస్. స్వీటీ, విజయకుమార్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'


