హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్

ప్రకాశం: కంభంలోని అన్ని పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్వహణ కమిటీల (ఎస్‌ఎంసీ) పునర్‌వ్యవస్థీకరణకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంఈవో సత్తార్ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నోటీసు బోర్డులో ఎన్నికల ప్రకటనను ఉపాధ్యాయులు సంపంగి సుబ్రహ్మణ్యం ప్రదర్శించారు. సెప్టెంబర్ 18న ఓటర్ల జాబితా, 25న అభ్యంతరాల స్వీకరణ తుది జాబితా ప్రకటించనున్నారు.