హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చివరి సమావేశంలో ఎంపీపీ ఎమోషనల్

TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ పద్మప్రియ దామోదర్‌రెడ్డికి ఇది చివరి సమావేశం కావడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఐదేళ్లుగా ప్రజల మౌలిక సదుపాయాల కోసం అందరం కలిసి పనిచేశామని తెలిపారు. తనకు సహకరించిన భర్త దామోదర్‌రెడ్డి, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.