KDP: సిద్ధవటం (M) భాకరాపేట గ్రామ పరిధిలోని గాంధీనగర్‌లో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడిని మంగళవారం సిద్ధవటం SI హారిక దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గణనాథుడి సన్నిధిలో ఎస్సై హారిక


