AKP: జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట అంగన్వాడీ కేంద్రం-2 ఆధ్వర్యంలో మంగళవారం గర్భిణులు, బాలింతలు, తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కార్యకర్త ఈరిగల భారతి ఆహార వైవిధ్యం, ప్రోటీన్, చిరుధాన్యాలు, ఆకుకూరలు, ఐరన్ ఆహార ప్రాధాన్యతను వివరించారు. జంక్‌ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోషక ఆహారంపై అవగాహన కార్యక్రమం


