హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాఠశాల వేళల్లో అదనపు బస్సులు నడపాలి'

SKLM: నరసన్నపేట మండలం సింగుపురం జంక్షన్ నుంచి పాఠశాల వేళల్లో విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడపాలని మంగళవారం విద్యార్థులు ఆర్టీసీ అధికారులను కోరారు. ఉదయం 8:30 గంటల సమయంలో బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఒకవేళ బస్సు వచ్చిన బస్సులో ఎక్కువ ప్రయాణికులు ఉండడంతో, ఎక్కే అవకాశం లేదన్నారు.