ASR: నూతన పింఛన్ల దరఖాస్తు గడువును పెంచాలని భారత మానవ హక్కులు,ఆర్టీఐ మండలి సభ్యుడు మజ్జి విఎస్ చక్రధర్ కోరారు.ఆయన డుంబ్రిగూడలో మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఆలస్యంగా అందుతుండటంతో దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నెల 16తో గడువు ముగియనుండటం, వరుస సెలవులు రావడంతో మరింత సమస్య ఏర్పడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలి


