కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని మంగళవారం ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఛైర్మన్ విళ్ళ సూరయ్య కాపు, ఎమ్మెల్యేను శేష వస్త్రంతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే


