హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నున్న మార్కెట్‌లో కార్మికుల సమ్మె

NTR: విజయవాడ నున్న కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌లో ముఠా కార్మికులు చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరింది. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన చేపట్టారు. కూలీ రేట్లు పెంచాలని పలుమార్లు యాజమాన్యాన్ని కోరినా స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగినట్లు సీఐటీయూ నేతలు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు కారణంగా ప్రస్తుత కూలీ సరిపోవడం లేదని అన్నారు.