E.G: గోపాలపురం మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో గుర్తించిన 64 పోలింగ్ స్టేషన్ల ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించారు. మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాలతో పాటు 18 గ్రామ పంచాయతీలు, ఆయా పంచాయతీల్లోని రెండు ముఖ్య ప్రదేశాల్లో జాబితాను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజమనోహర్, ఏవో మంగతాయారు, డిప్యూటీ ఎంపీడీవో సుజాత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ స్టేషన్ల ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన


