హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజన్ ప్లాన్‌పై అధికారులతో కలెక్టర్ సమీక్ష!

NDL: నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ, మండల స్థాయిలో తలసరి ఆదాయం, జీడీపీ పెంపునకు వినూత్న మార్గాలను అన్వేషించాలని కలెక్టర్ సూచించారు. ప్రజాప్రతినిధులకు సహాయకారిగా ఉండేలా సమగ్ర విజన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.