హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హౌసింగ్ ఏఈ గణేష్‌కు సన్మానం

SKLM: ఇంజనీర్స్‌ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను మంగళవారం మెలియాపుట్టి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల హౌసింగ్‌ ఏఈ కింజరాపు గణేష్‌ను టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అనపాన రాజశేఖర్‌రెడ్డి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని రాజశేఖర్‌రెడ్డి అన్నారు.